Select Location
All Locations
State
Region
City / District
ఇథనాల్ పెట్రోల్ వింత కష్టాలు: తీపి వాసనకు చీమలు, తేనెటీగలు క్యూ.. బైక్ ఓనర్స్ హడల్

ఇథనాల్ పెట్రోల్ వింత కష్టాలు: తీపి వాసనకు చీమలు, తేనెటీగలు క్యూ.. బైక్ ఓనర్స్ హడల్

పెట్రోల్ లో ఇథనాల్ మిక్సింగ్ ఏంటో గానీ వాహనదారులకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. లక్షలు పెట్టి కొన్న బైక్స్, కార్స్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ పోసిన తర్వాత రోడ్లపై మధ్యలోనే నిలిచిపోవటంతో అష్టకష్టాలు పడుతున్నారు. మరోపక్క వాహనాలను పరిశీలించిన మెకానిక్స్ అసలు ప్లాబ్లమ్ ఇథనాల్ పెట్రోల్ అని కన్ఫమ్ చేస్తున్నారు. ఇథనాల్ బ్లెండింగ్ ఆసరాగా మార్చుకుని కొన్ని పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న కల్తీ మోసాలతో వాహనాలు దెబ్బతింటున్న ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి.

ఇదే క్రమంలో ఒక బైకర్ ఈ85 పెట్రోల్ పట్టించుకునేందుకు బంకుకు వెళ్లగా ట్యాంక్ ఓపెన్ చేసి ఇంధనం నింపుతుంటే అక్కడికి భారీగా తేనెటీగలు వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తేనెటీగలు పెట్రోల్ ట్యాంక్ మూత దగ్గర వాలి ఇథనాల్ కలిపిన పెట్రోల్ లోని తీపి పదార్థాన్ని ఆస్వాధిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా నోటిపై వేలు వేసుకుంటున్నారు.

Source : V6 News

1 hour ago

Home Flash News