Select Location
All Locations
State
Region
City / District
నావికుల మృతిపై భారత్ ఆగ్రహం.. అమెరికా విదేశాంగ మంత్రికి జైశంకర్ ఫోన్

నావికుల మృతిపై భారత్ ఆగ్రహం.. అమెరికా విదేశాంగ మంత్రికి జైశంకర్ ఫోన్

న్యూఢిల్లీ: ఒమన్ గల్ఫ్‌‌‌‌లో వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఐరోపా పర్యటనలో ఉన్న కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ శనివారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్‌‌‌‌లో మాట్లాడారు.

ఈ సందర్భంగా భారత నావికుల మృతికి కారణమైన అమెరికా నౌకాదళ చర్యలపై ఆయన తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా వాణిజ్య నౌకలపై ఇలాంటి ప్రాణాంతక దాడులు చేయడం ఎంతమాత్రం సరికాదు" అని మంత్రి సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. భారత వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం జరిపిన దాడులను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. అమెరికా రాయబార కార్యాలయ అధికారి జేసన్ మీక్స్‌‌‌‌ను ప్రభుత్వం పిలిపించి సమన్లు జారీ చేసింది. ఇలాంటి ప్రాణాంతక దాడులు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదని హెచ్చరించింది.

Source : V6 News

1 hour ago

Home Flash News