భారత నౌకలపై దాడి.. ట్రంప్ ఆరోపణలను ఖండించిన ఇరాన్
న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధిలో భారత నౌకలపై దాడి చేసింది ఇరాన్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను ఇరాన్ ఎంబసీ ఖండించింది. ఈ వ్యాఖ్యలు నిరాధారమని స్పష్టం చేసింది. ఒమన్ గల్ఫ్‌లో వ్యాపార నౌకలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ముగ్గురు ఇండియన్ నేవీ సిబ్బంది మరణించారని, దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ట్రంప్ ఇలాంటి అబద్ధాలు చెపుతున్నారని ఇరాన్ మండిపడింది. ‘‘వారం రోజుల్లోనే అమెరికా 3 భారత నౌకలపై దాడులు చేసి, ముగ్గురు అమాయక నావికులను పొట్టనబెట్టుకుంది. ఈ నిజాన్ని దాచడానికే ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇది అత్యంత విచారకరం’’ అని ఇరాన్ ఎంబసీ వెల్లడించింది.