Select Location
All Locations
State
Region
City / District
బీఆర్ఎస్‌ కు 90 కాదు.. 9 సీట్లు కూడా రావు : మెదక్ ఎంపీ రఘునందన్ రావు

బీఆర్ఎస్‌ కు 90 కాదు.. 9 సీట్లు కూడా రావు : మెదక్ ఎంపీ రఘునందన్ రావు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌‌కు 90 సీట్లు కాదు కదా.. కనీసం 9 సీట్లు కూడా రావని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముక్కలయ్యే పరిస్థితి వస్తుందన్నారు. ఆ పార్టీకి తెలంగాణ సెంటిమెంట్ ఫ్యాషన్ గా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెడితే.. బీజేపీ మద్దతుతో తెలంగాణ వచ్చిందే తప్ప.. ఆనాటి టీఆర్ఎస్ లో ఉన్న ఇద్దరు ఎంపీలతో కాదన్నారు. ఈ మేరకు కేటీఆర్ చేసిన కామెంట్లకు రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు.

బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ముక్త్​ భారత్ కోసం పనిచేస్తామని.. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో రాజీపడం పడేది లేదన్నారు. పదేండ్ల కాంగ్రెస్ పాలన , రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలన చూసిన తరువాత కచ్చితంగా ప్రజలు బీజేపీకి ఓటు వేయాలనుకుంటున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అవే చివరి ఎన్నికలు అవుతాయన్నారు. ప్రతిపక్షంలో ఉండాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు మెంటల్ గా ఫిక్స్ అవుతున్నారని చెప్పారు.

Source : V6 News

1 hour ago

Home Flash News