ఎండలకు నీళ్లు ఆవిరి అయిపోతున్నాయి.. అందుకే నీటి కొరత : ఢిల్లీ సీఎం
అద్భుతం.. మహా అద్భుతం.. ఢిల్లీలో నీటి కొరతపై సీఎం రేఖా గుప్తాగారు చేసిన కామెంట్లపై ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు ఇదే ఫీలింగ్ తో కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ సీఎం మేడం ఏమన్నారు అంటే.. ఢిల్లీలో నీటి కొరత ఉందన్న విషయం అంగీకరిస్తూనే.. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం ఇంటింటికీ సరఫరా చేస్తున్న నీళ్లు.. మండే ఎండలకు మధ్యలోనే ఆవిరి అయిపోతున్నాయి.. అందుకే నీటి కొరత వస్తుంది అని.. అవును నిజమే కదా.. ఎండలకు గొంతులు ఎండిపోతున్నాయి.. అలాంటిది నీళ్లు ఆవిరి కావా ఏంటీ మరీ అంటున్నారు నెటిజన్లు. ఢిల్లీలో కొన్నాళ్లు జనం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. నీళ్లు రాక ట్యాంకర్లు కొనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. నీళ్లు కూడా ఇవ్వలేని బీజేపీ ప్రభుత్వం అంటూ విమర్శలు చేస్తున్నాయి.