Select Location
All Locations
State
Region
City / District
ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో కొత్త లొల్లి.. గ్రౌండ్లోకి వాటర్ బాటిల్స్ బ్యాన్పై ఫ్యాన్స్ గరం గరం

ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో కొత్త లొల్లి.. గ్రౌండ్లోకి వాటర్ బాటిల్స్ బ్యాన్పై ఫ్యాన్స్ గరం గరం

FIFA World Cup Bottles Ban: ఫుట్‌బాల్ లవర్స్‌కి అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమైక్య (FIFA) గట్టి షాక్ ఇచ్చింది. మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోయే మెగా టోర్నీ ఫిఫా వరల్డ్ కప్ 2026 రూల్స్‌లో లాస్ట్ మినిట్‌లో ఊహించని యూ-టర్న్ తీసుకుంది. స్టేడియం లోపలికి ఫ్యాన్స్ రీయుజబుల్ వాటర్ బాటిళ్లను తెచ్చుకోకుండా పూర్తిగా బ్యాన్ విధించింది. మొన్నటి వరకు ఖాళీగా ఉన్న, ట్రాన్స్‌పరెంట్ ఒక లీటర్ ప్లాస్టిక్ బాటిళ్లను అలౌ చేస్తామని చెప్పిన ఫిఫా.. ఇప్పుడు ప్లేయర్స్, అటెండీస్ సేఫ్టీ కోసమే ఈ డెసిషన్ తీసుకున్నామంటూ మాట మార్చింది.

ఫిఫా వరల్డ్ కప్ మ్యాచులు జరిగే టైమ్‌లో ఎండలు, హ్యుమిడిటీ (ఉక్కపోత) నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. అలాంటి సమయంలో వాటర్ బాటిల్స్ బ్యాన్ చేయడంపై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఫిఫాకి అఫీషియల్ స్పాన్సర్ అయిన కోకా-కోలా బ్రాండ్ వాటర్ బాటిళ్లను స్టేడియం లోపల భారీ రేట్లకు అమ్ముకోవడానికే ఈ ప్లాన్ వేశారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గత సమ్మర్‌లో జరిగిన క్లబ్ వరల్డ్ కప్‌లో స్టేడియం లోపల ఒక్కో వాటర్ బాటిల్‌కు అక్షరాలా 4 నుంచి 6 డాలర్లు (సుమారు రూ. 330 నుంచి రూ. 500) వసూలు చేశారు. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో దోచుకోవడానికి రెడీ అయ్యారని ఫుట్ బాల్ అభిమానులు ఫైర్ అవుతోంది.

Source : V6 News

1 hour ago

Home Flash News