Select Location
All Locations
State
Region
City / District
పార్టీ జెండా మోసినా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వరా?

పార్టీ జెండా మోసినా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వరా?

మానవపాడు, జూన్‌ 3: ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నామని చెబుతున్నా.. ఎక్కడా అమలు కావడం లేదని.. పార్టీ జెండా మోసిన తనకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే సంపత్‌ను సొంత పార్టీ కార్యకర్త నిలదీశాడు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి నివేదిక బస్సు యాత్రకు హాజరైన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. అదే గ్రామానికి చెందిన సూదెన్న అక్కడికి చేరుకున్నాడు. ముందుగా ఇల్లు మంజూరైందని చెప్పడంతో బేస్‌ లెవల్‌ వరకు నిర్మించుకున్నానని, ఇప్పుడు మంజూరు కాలేదని బిల్లు రాదని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే ఇల్లు మంజూరు గురించి ఆరా తీసి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Source : Smacy News

2 hours ago

Home Flash News