Select Location
All Locations
State
Region
City / District
గోదావరి పుష్కర పనులకు రూ.117కోట్లు :మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌

గోదావరి పుష్కర పనులకు రూ.117కోట్లు :మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌

జగిత్యాల టౌన్, వెలుగు: గోదావరి పుష్కరాలు–2027 అభివృద్ధి పనుల అదనపు బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌లో కలెక్టర్ సత్యప్రసాద్‌‌‌‌తో కలిసి అధికారులతో రివ్యూ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోటిలింగాల, ధర్మపురి క్షేత్రాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా రోడ్ల విస్తరణ, బ్రిడ్జిల నిర్మాణం, పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం మొదటి విడతలో రూ.117 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో కోటిలింగాలకు రూ.34.10 కోట్లు, ధర్మపురికి రూ.83.70 కోట్లు కేటాయించినట్లు వివరించారు. కొమిరెడ్డి, జ్యోతి విగ్రహాలు ఏర్పాటు చేస్తాం కోరుట్ల: లాయర్‌‌‌‌‌‌‌‌గా, రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా కోరుట్ల, మెట్పల్లి ప్రాంత ప్రజలకు స్వర్గీయ కొమిరెడ్డి రాములు అందించిన సేవలు మరువలేనివని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌పల్లిలో కొమిరెడ్డి రాములు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొమిరెడ్డి ఫోటో వద్ద నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా స్వర్గీయ మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి రాములు, జ్యోతి విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున సహకరిస్తామని హామీ ఇచ్చారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్​, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్​రావు, కొమిరెడ్డి రాములు కొడుకులు కొమిరెడ్డి కరంచంద్, విజయ్​ఆజాద్, తదితరులు పాల్గొన్నారు.

Source : V6 News

1 hour ago

Home Flash News