Select Location
All Locations
State
Region
City / District
ఎన్నాళ్లకెన్నాళ్లకు..తిరుమల కొండపై తగ్గిన భక్తుల రద్దీ.. జస్ట్ 3 గంటల్లో స్వామి దర్శనం..

ఎన్నాళ్లకెన్నాళ్లకు..తిరుమల కొండపై తగ్గిన భక్తుల రద్దీ.. జస్ట్ 3 గంటల్లో స్వామి దర్శనం..

తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా తగ్గుతోంది. రెండు రోజులుగా ( జూన్​ 1,2 తేదీల్లో) భక్తులు తగ్గుముఖం పడుతోంది. సోమవారం ( జూన్​ 1) ఉదయం 21 కంపార్టుమెంట్లలో భక్తులు ఉండగా... జూన్​ 2 వ తేదీకు 16 కంపార్టుమెంట్ల లో భక్తులు ఉన్నారు. స్వామివారి ఉచిత సర్వదర్శనానికి కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారు 10 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అలాగే సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం పడుతుందని, రూ.300 శీఘ్రదర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని తెలిపింది. భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాల్లో మార్పులుంటాయని టీటీడీ వెల్లడించింది.

జూన్​ 1 వ తేదీన 83వేల382 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 34వేల083 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు సమకూరింది. 3.97 లడ్డూలను లడ్డూ కౌంటర్ల ద్వారా విక్రయించినట్లు టీటీడీ తెలిపింది.

Source : V6 News

2 hours ago

Home Flash News