Select Location
All Locations
State
Region
City / District
The Journey Of Peddi | యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది జర్నీ ఆఫ్ పెద్ది’ వీడియో

The Journey Of Peddi | యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది జర్నీ ఆఫ్ పెద్ది’ వీడియో

The Journey Of Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జానీ కపూర్ జంటగా ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిన ‘ది జ‌ర్ని ఆఫ్ పెద్ది’ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. శ్రేయాస్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్పెషల్ వీడియోలో సినిమా అనౌన్స్‌మెంట్ చేసినప్పటి నుంచి, షూటింగ్ విశేషాలు, ప్రమోషన్స్ వరకు ఈ చిత్రం క్రియేట్ చేసిన సంచలనాన్ని అద్భుతంగా చూపించారు.

రామ్ చరణ్ రగ్గడ్ లుక్, బుచ్చిబాబు సన మార్క్ ఎమోషన్స్ ఈ సినిమాపై మొదటి నుంచీ భారీ హైప్‌ను క్రియేట్ చేయగా, ఆ అంచనాలన్నింటినీ ఈ వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన మ్యూజికల్ సెన్సేషన్ ‘చికిరి చికిరి’ సాంగ్ మేకింగ్ విజువల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్ ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో ఇందులో ప్రత్యేకంగా హైలైట్ చేశారు. అలాగే ఇటీవల మే 23న భోపాల్‌లో జరిగిన గ్రాండ్ మ్యూజికల్ మరియు ప్రీ-రిలీజ్ ఈవెంట్ విజువల్స్, అక్కడ రామ్ చరణ్, జానీ కపూర్, డైరెక్టర్ బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్ లతో కూడిన చిత్ర యూనిట్ చేసిన సందడి ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రామ్ చరణ్ ఈ చిత్రంలో క్రికెటర్, రన్నర్, మరియు పెహల్వాన్ వంటి మల్టిపుల్ స్పోర్ట్స్ అవతార్స్‌లో కనిపించనుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఈ గురువారం (జూన్ 4) న థియేటర్లలో ‘పెద్ది’ జాతర ఎలా ఉండబోతుందో ఈ ‘జర్నీ వీడియో’ చూస్తేనే అర్థమవుతోంది.

Source : Sakshi

1 hour ago

Home Flash News