Select Location
All Locations
State
Region
City / District
Annapurna College: AI ఎంత ఎదిగినా.. సినిమాకు ప్రాణం భావోద్వేగాలే: ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్

Annapurna College: AI ఎంత ఎదిగినా.. సినిమాకు ప్రాణం భావోద్వేగాలే: ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్

ఒకప్పుడు మనిషికి మనిషే పోటీ. కానీ, ప్రస్తుత ప్రపంచంలో మానవుడికి కొత్త సవాల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చేసింది. రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని విస్తరించుకుంటున్న AI, అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమవుతోంది. ఒకప్పుడు కేవలం ఐటీ రంగానికే పరిమితమైన ఈ టెక్నాలజీ, నేడు బ్యాంకింగ్, కన్సల్టింగ్, హెల్త్‌కేర్, విద్య, వినోదం, తయారీ రంగాలు సహా దాదాపు ప్రతి పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి హవా నడిపిస్తుంది. ఈ పరిణామాల దృష్ట్యా.. ఇండియా టాప్ సినీ ఎడిటర్, నేషనల్ అవార్డు విన్నర్ ఏ. శ్రీకర్ ప్రసాద్ (Akkineni Sreekar Prasad) కీలక విషయాలు వెల్లడించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్నీ రంగాల్లోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ సినీ పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. అయితే, సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసే అసలు శక్తి మాత్రం హ్యూమన్ ఎమోషన్స్ మాత్రమే అని ప్రముఖ ఎడిటర్ ఏ. శ్రీకర్ ప్రసాద్ అన్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ కాలేజ్ నిర్వహించిన మాస్టర్‌క్లాస్‌లో పాల్గొన్న ఆయన, భవిష్యత్‌లో సినిమా ఎడిటింగ్ ఎలా మారబోతోందో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Source : V6 News

1 hour ago

Home Flash News