Select Location
All Locations
State
Region
City / District
టీవీకే ప్రభుత్వంపై వీడియోలు.. యూట్యూబర్ అరెస్ట్!

టీవీకే ప్రభుత్వంపై వీడియోలు.. యూట్యూబర్ అరెస్ట్!

మదురై: టీవీకే ప్రభుత్వం, సీఎం విజయ్‌‌‌‌తో పాటు పలువురు మంత్రులపై విమర్శలు చేస్తూ వీడియోలు, పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ మరిదాస్‌‌‌‌ను చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మదురైలోని ఆయన ఇంటికి వెళ్లిన ప్రత్యేక బృందం స్థానిక పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకుని చెన్నైకి తరలించింది.

ప్రభుత్వ పనితీరుపై సోషల్ మీడియాలో వరుసగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ విభాగం సుమోటోగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరిదాస్‌‌‌‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. గతంలో కూడా రాజకీయ వ్యాఖ్యలతో పలు వివాదాల్లో చిక్కుకుని కేసులు ఎదుర్కొన్నారు. అయితే, ఆయన అరెస్టుపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆరోపించాయి. ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సైతం ఈ చర్యను ఖండిస్తూ.. ప్రజాస్వామ్యంలో విమర్శలను సహించాల్సిందేనని పేర్కొన్నారు.

Source : V6 News

1 hour ago

Home Flash News