Select Location
All Locations
State
Region
City / District
కీలక రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్‌!

కీలక రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్‌!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీరేట్లపై తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు.. రూపాయి అస్థిరతలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ సమావేశం జూన్‌ 3 నుంచి 5 వరకు జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇది రెండో విధాన సమీక్ష. ఈ సమీక్ష సమావేశంలో కీలక రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.

2025-26 ఏడాది ప్రారంభం నుంచి వరుసగా రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ.. గడిచిన రెండు సమావేశాలతోపాటు ఈసారీ రేట్ల తగ్గింపుపై తటస్థ వైఖరి తీసుకుంది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ వరుసగా మూడుసార్లు రేట్లలో కోత విధించింది. దాంతో మొత్తంగా 125 బేసిస్ పాయింట్లు (బీపీఎస్‌) తగ్గించింది. గత ఫిబ్రవరిలో 6.5 శాతంగా ఉన్న పాలసీ రేటు ప్రస్తుతం 5.25గా ఉంది.

Source : Sakshi

2 hours ago

Home Flash News