Select Location
All Locations
State
Region
City / District
CM Vijay | మేము కోట్ సూట్ వేసుకోకూడదా?.. విమర్శకులకు సీఎం విజయ్ గట్టి కౌంటర్!

CM Vijay | మేము కోట్ సూట్ వేసుకోకూడదా?.. విమర్శకులకు సీఎం విజయ్ గట్టి కౌంటర్!

CM Vijay Slams | తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తిరుచిరాపల్లిలో నిర్వహించిన భారీ కృతజ్ఞత సభలో సి. జోసెఫ్ విజయ్ పాల్గోన్న విష‌యం తెలిసిందే. అయితే ఈ స‌భ‌లో విజ‌య్ తన రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులు తన వస్త్రధారణపై చేస్తున్న వ్యాఖ్యలపై తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల కాలంలో విజయ్ సాంప్రదాయ వేష్టికి భిన్నంగా బ్లాక్ అండ్ వైట్ కోట్ సూట్ ధరిస్తూ సరికొత్త రాజకీయ శైలిని ప్రదర్శిస్తుండగా, దీనిపై వస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఇటీవల తాను వేసుకుంటున్న సూట్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారని, ఎందుకు తాము కోట్ సూట్ వేసుకోకూడదా అని విజయ్ ప్రశ్నించారు. అది కేవలం పెద్ద పదవుల్లో ఉన్న, అధికారంలో ఉన్న కొద్దిమందికే పరిమితమా అని నిలదీస్తూ, అలాంటి నియమమేమీ లేదని స్పష్టం చేశారు. తాను కేవలం నలుపు, తెలుపు రంగులనే ఎంచుకోవడం వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ, ఈ రంగులు పారదర్శకతకు, సరళతకు నిదర్శనమని, తన మనసులాగే తన పరిపాలన కూడా అంతే పారదర్శకంగా, స్పష్టంగా ఉంటుందని చెప్పడానికే ఈ రంగులను ఎంచుకున్నానని పేర్కొన్నారు. అలాగే నలుపు రంగు దేనికి ప్రతీక, అది ఎవరిని రిప్రజెంట్ చేస్తుందో తాను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదని, అది అందరికీ తెలిసిందేనంటూ తమిళనాడులోని సామాజిక న్యాయ, ద్రావిడ ఉద్యమ భావజాల మూలాలను పరోక్షంగా గుర్తుచేశారు. తాను అనవసరంగా ఎక్కువ మాట్లాడే వ్యక్తిని కానని, తన ప్రసంగాలు ఎప్పుడూ 20 నిమిషాల లోపే ఉంటాయని చెప్పారు. నాపై విమర్శలు చేసేవారి గురించి ప్రజలే చూసుకుంటారని, నన్ను మాత్రం కేవలం ప్రజల కోసం పనిచేయడంపైనే దృష్టి పెట్టమని నా శ్రేయోభిలాషులు చెప్పారని విజయ్ అన్నారు.

Source : Smacy News

1 hour ago

Home Flash News